Saturday, December 28, 2024

ఆన్‌లైన్ వ్యాక్సిన్ నిర్వహణ పోర్టల్ ‘యువిన్’ అక్టోబర్‌లో ప్రారంభించనున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్‌లో ఆన్‌లైన్ వ్యాక్సిన్ నిర్వహణ పోర్టల్ ‘యువిన్’ను ప్రారంభిస్తారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా శుక్రవారం ప్రకటించారు. అది ప్రస్తుతం పైలట్ ప్రాతిపదికపై నడుస్తున్నదని మంత్రి తెలిపారు. గర్భిణులు, జననం నుంచి 17వ ఏట వరకు పిల్లలకు వ్యాక్సిన్, మందులు వేయడానికి సంబంధించి శాశ్వత డిజిటల్ రికార్డు నిర్వహణ కోసం ఆ పోర్టల్‌ను రూపొందించినట్లు నడ్డా తెలియజేశారు.

మోడీ మూడవ ప్రభుత్వ తొలి 100 రోజుల సందర్భంగా విలేకరుల గోష్ఠిలో నడ్డా మాట్లాడుతూ. విస్తరించిన ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఎబి పిఎంజెఎవై)లో సాంఘిక, ఆర్థిక ప్రతిపత్తితో నిమిత్తం లేకుండా 70 ఏళ్ల వ్యక్తులు అందరినీ చేర్చనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్‌లో ప్రారంభించనున్న ఆ పథకం దాదాపు 4.5 కోట్ల కుటుంబాలలోని ఆరు కోట్ల మంది పౌరులకు లబ్ధి చేకూరుస్తుందని ఆయన తెలిపారు. మోడీ మూడవ విదత ప్రభుత్వం సాధించిన పలు ఇతర విజయాలను కూడా నడ్డా వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News