Friday, December 20, 2024

తొలిదశలో అభివృద్ధి చేసే స్టేషన్ల వివరాలు…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అమృత్ భారత్ పథకం కింద దేశం లోని 508 రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి పనులకు ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. తెలంగాణలో రూ. 894.09 కోట్లతో 21 స్టేషన్లు, ఏపీలో 453.50 కోట్లతో 18 స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఏపీ లోని ఏలూరు రైల్వేస్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు.

తెలంగాణలో… ఆదిలాబాద్, భద్రాచలం రోడ్, హఫీజ్‌పేట, హైటెక్‌సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్, జనగామ, కామారెడ్డి, కరీం నగర్, కాజీపేట, ఖమ్మం, మధిర, మహబూబ్‌నగర్,మహబూబాబాద్, మలక్‌పేట, మల్కాజిగిరి, నిజామాబాద్, రామగుండం, తాండూరు, యాదాద్రి (రాయగిరి), జహీరాబాద్. ఆంధ్రప్రదేశ్‌లో పలాస, విజయనగరం, అనకాపల్లి, దువ్వాడ, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, తెనాలి, రేపల్లె, పిడుగురాళ్ల, కర్నూలు, కాకినాడ టౌన్, ఏలూరు, తుని, ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News