Monday, December 23, 2024

ప్రధాని చేతుల మీదుగా రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్

- Advertisement -
- Advertisement -

హన్మకొండ : ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభించనున్నారని రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. గురువారం రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ కాజీపేటలో శంకుస్థాపన కానున్న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించి మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ మున్నా కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అరుణ్‌కుమార్‌జైన్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్ భారత రైల్వేలకే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు అని తెలిపారు. ఈ యూనిట్ తెలంగాణలో ఏర్పాటబుతున్న ప్రాజెక్టు అని తెలియచేశారు. ఈ యూనిట్ తెలంగాణలో ఏర్పాటవుతున్న తొలి భారతీయ రైల్వే తయారీ యూనిట్ అని, ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి దోహదపడుతుందన్నారు.

అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల రోలింగ్ స్టాక్‌లను ఉత్పత్తి చేస్తుందన్నారు. కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్ తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ ప్రాంతంలో కొత్త పారిశ్రామిక అభివృద్ధికి పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తు ప్రజల సామాజిక ఆర్థిక పురోగతిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వివరించారు. తొలుత కాజీపేటలో నెలకు 200 వ్యాగన్ల పిరియాడిక్ ఓవర్ హాలింగ్ చేపట్టేందుకు వ్యాగన్ రిపేర్ వర్క్‌షాపు మంజూరు చేయబడింది. ఈ ప్రాజెక్టు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్‌వీఎన్‌ఎల్‌కు అప్పగించబడింది. ఆ తరువాత రైల్వే వ్యాగన్ల అవసరాలు పెరగడం, స్థానిక పరిశ్రమను ప్రోత్సహించడానికి ఇతర విన్నపాలు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని కాజీపేటలోని వ్యాగర్ రిపేర్ షాపును రూ. 521 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే తయారీ యూనిట్‌గా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ప్రధాని మోడీచే ప్రారంభించబడిన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంతో కాజీపేటలోని రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం మరొక ప్రధానమైన అడుగు.

ఈ తయారీ యూనిట్‌తో సంవత్సరానికి 1200 వ్యాగన్లను తయారుచేయగల సామర్థంతో ప్రారంభించబడుతుంది. రెండవ సంవత్సరం నుంచి సంవత్సరానికి 2400 వ్యాగన్లను తయారుచగల్గుతుందన్నారు. వాగ్యన్ల లభ్యతను మెరుగపర్చడం ద్వారా తయారీ యూనిట్ పరిశ్రమను ప్రోత్సహిస్తుంది. అదనంగా రోలింగ్ స్టాక్ ఉత్పత్తి పెరగడం రాష్ట్ర ఆర్థిక వృద్ధిని మాత్రమే కాకుండా దేశమంతటా కీలకమైన, చాలా అవసరమైన భారీ వస్తువులను రవాణా చేయడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను పెంచుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News