Monday, December 23, 2024

2 రోజుల జపాన్ పర్యటనకు ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

Modi for Japan

న్యూఢిల్లీ: టోక్యోలో మే 24న జరిగే క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. ఈ సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బిడెన్‌తో కూడా ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్‌ జలమార్గాన్ని నిర్వహించాలనే లక్ష్యంతో, క్వాడ్ సభ్యులు సమావేశం కాబోతున్నారు.  పసిఫిక్ , హిందూ మహాసముద్రంలో విస్తరించి ఉన్న ఆర్థిక మరియు భద్రతా ప్రయోజనాలపై వీరు చర్చించనున్నారు . ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అక్రమ చేపల వేటను నిరోధించే లక్ష్యంతో క్వాడ్ దేశాలు ఉపగ్రహ ఆధారిత సముద్ర చొరవను చేపట్టాలని వారు  భావిస్తున్నారు.

ఫిషింగ్ బోట్లు ట్రాన్స్‌పాండర్‌లను ఆపివేసినప్పుడు కూడా అక్రమ చేపల వేటను పర్యవేక్షించేందుకు ఈ వ్యవస్థ క్వాడ్ దేశాలను అనుమతిస్తుంది. ఆరోపిత అక్రమ చేపల వేట నుండి చైనాను నిరోధించడం ఈ ప్రయోగం లక్ష్యం. ఇండో-పసిఫిక్‌లో జరుగుతున్న 95 శాతం అక్రమ చేపల వేటలో  ఆ దేశమే కారణమని ఆరోపణ. సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో,  ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరువురు నేతలు భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షిస్తారని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News