- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల పోరు ఊపందుకోవడంతో కమలం పార్టీ అగ్రనేతలు ప్రచారానికి నడుం బిగించారు. అందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ నెల 7న ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన బీసీ జనగర్జన సభకు హాజరైన మోడీ.. నేడు(శనివారం)మరోసారి రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఈ సభ కోసం రాష్ట్ర పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈరోజు సాయంత్రం 4.45 గంటలకు ప్రధాని మోడీ ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నుంచి నేరుగా బహిరంగ సభకు వెళ్లి.. 5.40 వరకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి తిరిగి ఢిల్లీకి బయల్దేరనున్నారు.
- Advertisement -