- Advertisement -
హైదరాబాద్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం సోమవారం నిధులు విడుదల చేసింది. ఈ పథకం కింద చేరిన రైతులకు 13వ విడత కింద రూ.16,800కోట్లు విడుదల చేసింది. రబీ సీజన్‌లో పంటల సాగు పెట్టుబడులకోసం ఈ నిధులు ఉపయోగించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమ చేసింద. ఒక్కో రైతు ఖాతాకు రూ.2000 చొప్పున నిధలు జమ చేసింది.
కేంద్ర ప్రభత్వం 2018 డిసెంబర్‌లో తొలుత ఈ పథకాన్ని ప్రారంభించింది. 2019 ఫిబ్రవరి నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద గత ఏడాది అక్టోబర్‌లో 12 విడత సాయాన్ని రైతుల ఖాతాకు జమ చేసింది. రాష్ట్రంలో 8కోట్ల మంది రైతులకు ఏటా రూ.6వేల చొప్పు మూడు విడతలుగా విడతకు రూ.2వేల చొప్పున రైతుబ్యాంకు ఖాతాకు జమ చేస్తోంది.
- Advertisement -