Sunday, December 22, 2024

రేపు రైతుల ఖాతాలకు పిఎం కిసాన్ నిధులు

- Advertisement -
- Advertisement -

వ్యవసాయరంగానికి ప్రోత్సహాకంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తన్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం నిధులను మంగళవారం రైతుల ఖాతాలకు జమ చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈ పథకం కోసం 20వేలకోట్లు రూపాయలను ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనున్నారు.దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ పధకం పరిధిలో ఉన్న 9.3కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. తాజాగా కేంద్రంలో మూడోసారి ఏర్పాటైన నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వం ఇటీవల 17వ విడత పిఎం కిసాన్ సహాయాన్ని ప్రకటించింది. కొత్త ప్రభుత్వం తొలి సంతకంగా దాదాపు 20,000 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే, ఈ నిధులు రైతుల ఖాతాలో జమ అయ్యాయో లేదో వారి ఆన్‌లైన్ లో తనిఖీ చేయవచ్చు.

పిఎం కిసాన్ పథకం 17వ విడత విడుదలైన తర్వాత., కృషి సఖిలుగా నియమించబడిన 30,000 కంటే ఎక్కువ స్వయం సహాయక బృందాలకు ప్రధాని మోడీ సర్టిఫికేట్‌లను మంజూరు చేస్తారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో సమన్వయంతో కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 17వ విడతను 18 జూన్ 2024న ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. ఈ చర్య దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. ఇందుకోసం మొత్తం రూ.20,000 కోట్లు ఖర్చు కానుంది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News