Sunday, December 22, 2024

రేపు మహారాష్ట్ర, రాజస్థాన్‌లో మోడీ పర్యటన

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం (ఆగస్టు 25) మహారాష్ట్ర, రాజస్థాన్‌లో పర్యటిస్తారు. మహారాష్ట్ర లోని జలగావ్‌లో ఆదివారం 11 లక్షల కొత్త ‘లక్షపతి దీదీలు’ ను సత్కరిస్తారు. మూడోసారి తమ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. 4.3 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు (ఎస్‌హెచ్‌జీలు) కు చెందిన 48 లక్షల సభ్యులకు ప్రయోజనం కలిగించే రూ. 2,500 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ను విడుదల చేస్తారు. అలాగే 2.35 లక్షల ఎస్‌హెచ్‌జీలకు చెందిన 25.8 లక్షల సభ్యులకు లబ్ధి చేకూర్చే రూ. 5000 కోట్ల రుణాలను పంపిణీ చేస్తారు.

లక్షపతి దీదీలు పథకం ప్రారంభం నుంచి సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ సభ్యురాలు ఏటా రూ.లక్ష వరకు ఆర్జిస్తోంది. ఇప్పటివరకు ఈ ర్యాంకుకు దాదాపు కోటి మంది మహిళలు చేరుకున్నారు. అయితే ఈ సంఖ్యను మూడు కోట్ల వరకు చేర్చడానికి ప్రభుత్వం లక్షాన్ని నిర్దేశించుకుంది. ఆదివారం రాజస్థాన్ హైకోర్టు ప్లాటినం జూబిలీ ఉత్సవాల్లో మోడీ పాల్గొంటారు. జోధ్‌పూర్ లోని హైకోర్టు క్యాంపస్‌లో ఈ వేడుకలు జరుగుతాయి. హైకోర్టు మ్యూజియంను కూడా మోడీ ప్రారంభిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News