Monday, December 23, 2024

ఈనెల 29న మోడీ అధ్యక్షతన కాశీ తెలుగు సంగమం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఈనెల 29న ప్రధాని మోడీ తన స్వంత నియోజక వర్గం వారణాసిలో తెలుగు సంగమం కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. వర్చువల్‌లో ఆయన ప్రసంగిస్తారు. 12 ఏళ్లకోసారి జరిగే గంగా పుష్కరాలకు తెలుగు మాట్లాడే భక్తులు వస్తున్న సందర్భంగా ఈ తెలుగు సంగమం జరుగుతోంది. పుష్కరాలు 12 రోజుల పాటు జరుగుతాయి. శ్రీకాశీ తెలుగు సమితి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని సంస్థ అధ్యక్షుడు బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు చెప్పారు.

ఈ కార్యక్రమానికి ఆయన సమన్వయ కర్తగా ఉంటారు. గంగా తీరంలోని మానసరోవర్ ఘాట్ వద్ద ఒకే రోజు ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలతో వారణాసికి ఉన్న ప్రాచీన నాగరికతా సంబంధాలు ప్రముఖంగా చూపించేలా సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News