Monday, December 23, 2024

వచ్చే నెలలో ప్రధాని అమెరికా పర్యటన..

- Advertisement -
- Advertisement -

వచ్చేనెలలో ప్రధాని అమెరికా పర్యటన
22న వైట్‌హౌస్‌లో బైడెన్ విందు
వాషింగ్టన్ /న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఖరారు అయింది. వచ్చే నెల జూన్‌లో ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షులు జో బైడెన్, ప్రధమ పౌరురాలు జిల్ బైడెన్ ఆహ్వానంపై అమెరికా పర్యటనకు వెళ్లుతున్నారని విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది. ఈ విషయాన్ని అమెరికాలో వైట్‌హౌస్ కూడా అధికారికంగా ఇదే రోజు ప్రకటించింది. ప్రధాని మోడీకి జూన్ 22న వైట్‌హౌస్‌లో బైడెన్ తరఫున అధికారిక విందు ఉంటుంది. 2021లో ప్రధాని మోడీ క్వాడ్ సమ్మిట్ కోసం అమెరికాకు వెళ్లినప్పుడు వైట్‌హౌస్‌లో బైడెన్‌ను కలిశారు. తరువాత వైట్‌హౌస్‌కు ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి. తమ దేశ అధ్యక్షులు బైడెన్ ఆహ్వానంపై ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు రావడం ఇరు దేశాల మధ్య మరింత సన్నిహిత భాగస్వామ్యం దిశలో ఓ అడుగు అవుతుందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరిని జియాన్ పియిరి తెలిపారు.

బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాని అమెరికా పర్యటన కీలక విషయం అవుతుందన్నారు. పలు ద్వైపాక్షిక , అంతర్జాతీయ, ప్రత్యేకించి ప్రాంతీయ అంశాలపై చర్చలు జరుగుతాయన్నారు. జి 20 సదస్సుకు భారత్ సారథ్యం నేపథ్యంలో బైడెన్ ఒబామా భేటీ కీలక విషయం అవుతుందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. వైట్‌హౌస్‌కు ప్రధాని వెళ్లే విషయాన్ని తెలిపిన అధికారులు అమెరికాలో ప్రధాని మోడీ పర్యటన ఎన్నిరోజులు సాగుతుందనేది వెల్లడించలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News