Friday, December 20, 2024

బిజెపి ప్లాన్.. 30న అల్లాదుర్గంకు ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలల్లో బిజెపి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 30న సభలో పాల్గొంటున్నారు. దీనికి గాను ఈ రెండు నియోజకవర్గాల సెంటర్ పాయింట్‌గా ఉన్న అల్లాదుర్గంను ఎంచుకున్నారు. ఈ ప్రాంతం జహీరాబాద్ పరిధిలో ఉన్నప్పటికీ మెదక్ నియోజకవర్గానికి పక్కనే ఉంటుంది. దీంతో వ్యూహాత్మకంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ప్రదాని పాల్గొనే బహిరంగ సభా స్థలాన్ని ఇప్పటికే జహీరాబాద్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బిబి పాటిల్ పరిశీలించారు.

పెద్ద ఎత్తున ఈ సభను నిర్వహిచేందుకు బిజెపి నాయకత్వం యోచిస్తోంది. భారీ ఎత్తున జన సమీకరణను జరపడం ద్వారా ప్రత్యర్థులకు సవాల్ విసరాలని బిజెపి అభ్యర్థులు బిబి పాటిల్, రఘునందన్‌రావులు యోచిస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు అభ్యర్థులు మండలాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణుల సమావేశాలు పూర్తి చేశారు. కొన్ని మండలాల్లో ప్రచారం కూడా పూర్తయింది. ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా జరిగాయి.

ప్రధాని సభను సక్కెస్ చేయడం ద్వారా తమ గెలుపును ఖాయం చేసుకోవాలని బిబి పాటిల్, రఘునందన్‌రావు భావిస్తున్నారు. రఘునందన్‌రావు తన తెలివి తేటలతో ప్రచార వ్యూహాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. రెండు సార్లు ఎంపిగా గెలిచిన అనుభవంతో బిబి పాటిల్ మరో సారి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇప్పటి వరకు ఖరారయిన షెడ్యూల్ ప్రకారం 30న మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ సభ ఉంటుంది. దీనికి తగిన విధంగా బందోబస్తుకు పోలీస్ బలగాలు సిద్దమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News