Thursday, March 20, 2025

ఎపిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన

- Advertisement -
- Advertisement -

అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా సీఆర్డీఏ అన్ని ఏర్పాట్లను ప్రారంభించింది. మోడీ పర్యటనకు సంబంధించి సీఎం చంద్రబాబుతో సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సచివాలయం వెనుక స్థలాన్ని పరిశీలించారు. రాజధానిలో నవ నగరాల నిర్మాణాలకు సంబంధించిన పనులకు ప్రధాని శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ప్రధాని పర్యటన కోసం రాజధానిలోని ఉద్ధండరాయుని పాలెం, సచివాలయం వెలుపల ఉన్న హెలిపాడ్లను సైతం వినియోగించాలని నిర్ణయించారు. ప్రధాని పర్యటన ఖరారు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఒకవేళ ఇది ఖరారైతే సీఆర్‌డిఏ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తారు.

ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో సీఎం భేటీ కానున్నారు. రాజధాని అమరావతి పుననిర్మాణ పనుల ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ ని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. మోదీని ఆహ్వానించేందుకు ఇవాళ దిల్లీ వెళ్తున్నట్లు సీఎం కేబినెట్ లో ప్రస్తావించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న చంద్రబాబు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాలు, కార్యక్రమాల కింద రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న నిధుల జాబితాను అందజేయనున్నారు. నిధుల్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా నిర్మలా సీతారామన్ ను ఈ సందర్భంగా కోరనున్నారు. అంతేకాకుండా శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంటి వివాహ వేడుకకు చంద్రబాబు హాజరువుతారు. బుధవారం ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ఒప్పందాలు చేసుకోనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News