Friday, December 20, 2024

12న బెంగళూరులో ప్రధాని పర్యటన

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : శాసనసభ ఎన్నికల ముంగిట ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 12న మరోమారు రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. బెంగళూరు – మైసూ రు పది మార్గాల ఎక్స్‌ప్రెస్ హైవేను ఆయన జాతికి అంకితం చేసిన అనంతరం మండ్యలో జరిగే రోడ్ షోలోనూ, మద్దూరులో జరిగే భారీ బహిరంగసభలోనూ ప్రధాని పాల్గొననున్నారు. జేడీఎ్‌సకు కంచుకోటగా ఉన్న పాత మైసూరు జిల్లాల్లో ప్రధాని పర్యటనతో బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చక్కెరనాడుగా ఖ్యాతి గడించిన మండ్య జిల్లాలో ప్రధాని పర్యటన నేపధ్యంలో మొత్తం జిల్లా కాషాయ జెండాలతో రెపరెపలాడుతోంది. ప్రధానికి స్వాగతం పలుకుతూ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. మండ్యలోని ప్రభుత్వ గెస్ట్‌హౌస్ సర్కిల్‌లో ప్రారంభమయ్యే ప్రధాని రోడ్ షో జయచామారజేంద్ర ఒడెయార్ సర్కిల్ మార్గంలో 1.5 కిలోమీటర్ల మేర కొనసాగి నంద సర్కిల్ వద్ద ముగియనుంది.

ప్రధాని రోడ్ షో జరిగే రహదారికి యుద్ధ ప్రాతిపదకన మరమ్మత్తులు చేపట్టారు. మద్దూరు తాలూకా గెజ్జలగెరె కాలనీలోని 16 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాని భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఏడీజీపీ అలోక్‌కుమార్ గురువారం ప్రధాని పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మండ్య కార్యక్రమాలు ముగించుకుని ధారవాడకు చేరుకోనున్న ప్రధాని రూ.5వేల కోట్ల విలువైన వివిధ పథకాలను ప్రారంభించి మరికొన్నింటికి శంకుస్థాపన చేస్తారు. ఈనెల 12న మధ్యాహ్నం 2 గంటలకు హుబ్బళ్లికి చేరుకోనున్న ప్రధాని, ధారవాడ ఐఐటీ నూతన భవంతులను, ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన హుబ్బళ్ళి రైల్వే ప్లాట్‌ఫాంను ప్రారంభిచనున్నారు. 1200 కోట్ల ఖర్చుతో 144 గ్రామాలకు తాగునీటిని అందించే పథకాన్ని, రూ.250 కోట్ల ఖర్చుతో ఏర్పాటైన జయదేవ హాస్పిటల్ శాఖను ప్రధాని ప్రారంభించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News