Sunday, December 22, 2024

ఈ నెల 26-28 తేదీలలో మోడీ జర్మనీ, యుఎఇ పర్యటన

- Advertisement -
- Advertisement -

PM Modi to visit Germany And UAE on 26-28 this month

న్యూఢిల్లీ: జర్మన్ చాన్సలర్ ఒలాఫ్ షోల్స్ ఆహ్మానం మేరకు జి7 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 26, 27 తేదీలలో దక్షిణ జర్మనీలోని షోల్స్ ఎల్మావ్‌కు చెందిన ఆల్పైన్ కాజిల్‌ని సందర్శించనున్నారు. ఉక్రెయిన్ సంక్షోభం, ఇండో-పసిఫిక్‌లో పరిస్థితితో సహా ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సవాళ్లను జి7 సదస్సు చర్చించనున్నది. ఈ పర్యటన అనంతరం..ఇటీవల కన్నుమూసిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌కు సంతాపం తెలియచేసేందుకు జూన్ 28న ప్రధాని మోడీ అబు దాబిని సందర్శించనున్నారు. ప్రపంచంలోని ఏడు సంపన్న దేశాలైన బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికాల కూటమైన జి7కు ప్రస్తుతం జర్మనీ చైర్మపర్సన్‌గా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది మే 2న భారత్-జర్మనీ అంతర్ ప్రబుత్వ సంప్రదింపుల(ఐజిసి) ఆరవ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ జర్మనీని సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News