స్వాగతం పలకనున్న మంత్రి తలసాని
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) 20వ సాన్నతకోత్సవంలో ప్రధాని పాల్గొననున్నారు. ప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎస్పీజి రంగంలోకి దిగి ఐఎస్‌బి క్యాంపస్‌ను వారి ఆధీనంలోకి తీసుకుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. ప్రధానిప మోడీ గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రధాని మోడీకి తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగం పలకనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటల వరకు ఎయిర్‌పోర్టు పార్కింగ్‌లో రాష్ట్ర బిజెపి నేతలతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుని.. అక్కడ దిగిన తర్వాత రోడ్డు మార్గంలో గచ్చిబౌలి ఐఎస్బీకి చేరుకుంటారు.
మధ్యాహ్నం 2 నుంచి 3.15 గంటల మధ్య ఐఎస్‌బి వార్షికోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి బేగంపేటకు మోడీ చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు బేగంపేట నుండి చెన్నైకి బయల్దేరి వెళతారు. రూ.31,400 కోట్ల విలువైన 11 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని శంకుస్థాపన చేయబోయే ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే బెంగళూరుచెన్నై (262 కిమీ) ఎక్స్‌ప్రెస్ హైవే కూడా ఉంది. ఐఎస్‌బీ స్నాతకోత్సవ కార్యక్రమంలో మొత్తం 930 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. వీళ్లలో మొహలీ క్యాంపస్‌కు చెందినప 330 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. గురువారంబ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
గచ్చిబౌలి స్టేడియం, త్రిపుల్ ఐటి జంక్షన్ నుంచి విప్రో జంక్షన్, ట్రిపుల్ ఐటీ నుంచి గచ్చిబౌలి మధ్య ఉన్న కంపెనీలు.. వారి ఆఫీస్ టైమింగ్స్ మార్చుకోవాలి, గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు.. గచ్చిబౌలి జంక్షన్ వద్ద నుంచి బొటినికల్ గార్డెన్‌కొంగాపూర్ ఏరియా ఆసుపత్రి మసీదు బండ మసీదు బండ కమాన్ హెచ్‌సీయూ డిపో రోడ్డు మార్గంలో వెళ్లాలి, లింగపల్లి నుంచి గచ్చిబౌలికి వెళ్లే వాహనాలు.. హెచ్‌సియు డిపో రోడ్డు మసీదు బండ కమాన్ మసీదు బండ కొండాపూర్ ఏరియా ఆసుప్రతిబొటానికల్ గార్డెన్ మార్గంలో వెళ్లాలి, విప్రో నుంచి లింగపల్లి వైపు వెళ్లే వాహనాలు.. క్యూసిటీగౌలిదొడ్డిగోపనపల్లి ఎక్స్ రోడ్డుహెచ్‌సీయూ బ్యాక్ గేట్‌నల్లగండ్ల మీదుగా వెళ్లాలి, విప్రో నుచి గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు.. ఫెయిర్‌ఫీల్‌డ హోటల్ నానక్ రామ్‌గూడ రోటరీఔటర్ రింగ్ రోడ్డుఎల్ అండ్ టి టవర్స్ మార్గంలో వెళ్లాలి, కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు.. కేబుల్‌బ్రిడ్జిపైకి ఎక్కే ర్యాంప్ నుంచి రైట్ తీసుకుని రత్నదీప్‌మాదాపూర్ పిఎస్ సైబర్ టవర్స్‌హైటెక్స్ కొత్తగూడబొటానికల్ గార్డెన్ మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచించారు.