Sunday, December 22, 2024

మార్చి మొదటి వారంలో ప్రధాని మోడీ బెంగాల్ పర్యటన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తన అధికార కార్యక్రమాల్లో భాగంగా మార్చి 1, 2 తేదీల్లో పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తారు. ఆయన మార్చి 6న ఉత్తర 24 పరగణాల జిల్లాలో మహిళల ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించవచ్చు. కల్లోలిత సందేశ్‌ఖలి ఆ జిల్లాలోనే ఉన్నది. బిజెపి వర్గాల సమాచారం ప్రకారం, మోడీ అధికార పర్యటనలో మార్చి 1న ఆరామ్‌బాగ్‌ను, 2న కృష్ణనగర్‌ను సందర్శిస్తారు. ప్రధాని మోడీ బహిరంగ సభలలో కూడా ప్రసంగిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌లో మోడీ పర్యటించడం బిజెపి, రాష్ట్ర అధికార పక్షం టిఎంసి మధ్య తీవ్ర రాజకీయ వివాదం నేపథ్యంలో జరగనున్నది.

టిఎంసి నాయకుడు షాజహాన్ షేక్, అతని మద్దతుదారులు ‘భూములు ఆక్రమించుకున్నారు, లైంగిక దాడులు చేశారు’ అన సందేశ్‌ఖలిలో పలువురు మహిళలు ఆరోపించిన తరువాత రెండు పార్టీల మధ్య రాజకీయ వివాదం నెలకొన్నది. ఉత్తర 24 పరగణాల జిల్లా కేంద్రమైన బరసాత్‌ను మోడీ సందర్శించినప్పుడు ఫిర్యాదీలు కొందరినిఆయన కలుసుకోవచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి. షేక్ అనుచరులు ఇద్దరిని ఇతరులతో పాటు సామూహిక అత్యాచారం, హత్యా యత్నం అభియోగాలపై అరెస్టు చేశారు. అయితే, టిఎంసి ఆ ఆరోపణలను ఖండించింది. తమ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేసేలా కొందరు ఫిర్యాదీలను బిజెపి ప్రేరేపించిందని టిఎంసి నిందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News