Tuesday, December 24, 2024

నేడు జమ్మూకు ప్రధాని..

- Advertisement -
- Advertisement -

 PM Modi to visit Jammu Kashmir Tomorrow

కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత మొదటిసారి మోడీ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కనీవిని ఎరుగని భద్రతా ఏర్పాట్లు

న్యూఢిల్లీ/జమ్మూ: ప్రధాని మోడీ ఆదివారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ జమ్మూ ప్రాంతంలో పర్యటించనున్నారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఆదివారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జమ్మూ ప్రాంతం నుంచి నిర్వహించాలని, ఇక్కడ ఓ సభ సందేశం వెలువరించాలని సంకల్పించారు. ప్రధాని జమ్మూ పర్యటనకు రెండ్రోజుల ముందు శుక్రవారం ఈ ప్రాంతంలోనే భారీ సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడి జరిగింది. ఇది కేవలం ప్రధాని రాకను దృష్టిలో పెట్టుకుని ఉగ్రవాదులు కేవలం వ్యూహాత్మకంగా చేసిందేనని ఇంటలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. దీనితో ఈ ప్రాంతం లో కనివిని ఎరుగని స్థాయిలో ఇప్పుడు పారాహుషార్ ముమ్మరం చేశారు. ప్రధాని తమ పర్యటన దశలోనే పలు బహుళ స్థాయి ప్రాజెక్టులకు కూడా ఇక్కడ శంకుస్థాపన చేస్తారు. వీటివిలువ దాదాపు రూ 20 కోట్లు వ్యయం అంచనా వేశారు. ఇక అన్నింటికంటే ప్రధానంగా ఇక్కడ బనిహాల్ ఖ్యాజీగండ్ రాదారి టన్నెల్ నిర్మాణ పనులకు ప్రధాని పునాది రాయి వేస్తారు. ఈ ఒక్క ప్రాజెక్టుకే రూ 3100 కోట్లు అంచనావేశారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రధాని పర్యటన జాతీయ స్థాయి ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రత్యేకించి టెర్రరిస్టుల బెడద ఇప్పటికీ పొంచి ఉన్న ప్రాంతాల్లోనే ప్రధాని పలు శంకుస్థాపన కార్యక్రమాలకు రావ డం, తరవాత ఎక్కువ సమయం పంచాయతీరాజ్ సదస్సు జరగడం వంటి పరిస్ధితుల నడుమ భద్ర తా దళాలు నిరంతర పర్యవేక్షణ సాగిస్తున్నాయని అధికారులు తెలిపారు.

శుక్రవారం జమ్మూ నగర శివార్లకు అతి సమీపంలో సంజ్వన్ ఆర్మీక్యాంప్ వద్ద భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. కొత్తగా చొచ్చుకుని వచ్చిన జైష్ ఏ మెహమ్మద్ (జెఇఎం) ఆత్మాహుతి బాంబర్లు ఇక్కడ సైనిక శకటంపై దాడికి దిగారు, ఈ సంఘటనతో ఇప్పుడు ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు జరిగాయని అధికారులు శనివారం తెలిపారు. సంబా జిల్లాలో పల్లి పంచాయత్‌కు ప్రధాని అక్కడ జరిగే జాతీయ పంచాయతీరాజ్ సదస్సు కోసం వెళ్లుతారు. ఈ మార్గం అంతటా కంచుకోటవంటి భద్రత నెలకొని ఉంది. కేంద్ర పాలిత ప్రాంతం అంతటా రెడ్ అలర్ట్ జారీ చేశారు. సంజ్వాన్ ఎన్‌కౌంటర్ ప్రకంపనలు ఇప్పటికీ చెలరేగుతూనే ఉన్నాయి. భద్రతా బలగాలు ఇక్కడ ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. ఓ జవాను మృతి చెందారు.అయితే వారు జమ్మూవరకూ చొచ్చుకువచ్చి ఏకంగా సైనిక బలగాలను ఎంచుకునే దాడికి దిగడం కలవరానికి దారితీసింది. పైగా సూసైడ్ బాంబర్లు కూడా కావడంతో ఇది ఓ విధంగా పుల్వామా ఘటనను గుర్తుకు తీసుకువచ్చింది.

 PM Modi to visit Jammu Kashmir Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News