న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా గణనీయమైన ముందడుగు పడుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన రక్షణ రంగ పరికరాలను ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 19న ఉత్తర్ ప్రదేశ్‌లోని ఝాన్సీలో త్రివిధ దళాలకు చెందిన ప్రధానాధికారులకు అందచేయనున్నారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఎఎల్) రూపకల్పన చేసి తయారుచేసిన తేలికపాటి యుద్ధ విమానాన్ని, భారతీయ అంకుర సంస్థలు తయారుచేసిన డ్రోన్లు, మానవరహిత వాహనాలను(యుఎవి) ప్రధాని మోడీ లాంఛనంగా ఆర్మీ చీఫ్‌కు, నౌకాదళానికి చెందిన నౌకల కోసం డిఆర్‌డిఓ రూపకల్పన చేయగా బిహెచ్‌ఇఎల్ తయారుచేసిన అధునాతన ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ను నౌకాదళ చీఫ్‌కు అందచేయనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ రక్షణ పారిశ్రామిక కారిడార్‌కు చెందిన ఝాన్సీలో రూ.400 కోట్లతో ఏర్పాటు చేయనున్న రక్షణ పరికరాల ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఈ ప్రాజెక్టును భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్నది.
PM Modi to visit Jhansi on Nov 19th