- Advertisement -
హిందూ మహా సముద్ర ప్రాంతంలో మారిషస్ భారతదేశానికి కీలకమైన మిత్రపక్షమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని మార్చి 11, 12 తేదీలలో మారిషస్ లో అధికార పర్యటనకు వెళ్తున్నారు. తన పర్యటనతో రెండు దేశాల సంబంధాలలోనూ కొత్త అపూర్వ అధ్యాయం మొదలవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. హిందూ మహా సముద్ర ప్రాంతంలో మారిషస్ సన్నిహిత పొరుగు దేశం అనీ, ఆఫ్రికా ఖండానికి గేట్ వే అని ప్రధాని ఒక ప్రకటనలో తెలిపారు. భారత – మారిషస్ దేశాలకు చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత పదేళ్లుగా ఉభయదేశాల మధ్య సంబంధాలలో గణనీయమైన ప్రగతి సాధించామని మోదీ అన్నారు. తన మారిషస్ పర్యటనతో భారత- మారిషస్ సంబంధాల మధ్య కొత్త అధ్యాయం ప్రారంభం కాగలదన్న విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.
- Advertisement -