Tuesday, April 8, 2025

మార్చి 11 న మారిషస్‌కి ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనపై మార్చి 11న మారిషస్ వెళ్లబోతున్నారు. ఆ దేశ జాతీయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. మారిషస్ జాతీయ దినోత్సవంలో భారత రక్షణ బలగాల దళం కూడా పాల్గొనబోతున్నదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ప్రధాని మోడీ మార్చి 11,12 తేదీల్లో మారిషస్ పర్యటించనున్నారు. మారిషస్ జాతీయ దినోత్సవం మార్చి 12న జరుగనున్నది. ఈ సందర్భంగా భారత నౌకాదళం ఓడ కూడా మారిషస్‌కు వెళ్లబోతున్నది. మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్‌లో మోడీ మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్‌తో భేటీ అవుతారు.

అలాగే మారిషస్‌లోని ప్రతిపక్ష నాయకుడు రామ్ గులాంతో కూడా విస్తృతస్థాయిలో చర్చలు జరుపుతారు. మారిషస్‌తో భారత్‌కు చిరకాల సంబంధాలున్నాయి. మారిషస్ జనాభా 12 లక్షలు. అందులో భారతీయ సంతతికి చెందిన వారే 70 శాతం మంది ఉంటారు. 2005 నుంచి మారిషస్ ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఇండియా కొనసాగుతున్నది. రెండు దేశాల మధ్య 554 మిలియన్ల డాలర్ల మేరకు వాణిజ్యం జరుగుతోంది. గత 17 ఏళ్లలో రెండు దేశాల మధ్య వాణిజ్యం 132 శాతం మేరకు పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News