Monday, December 23, 2024

జూలై 8న వరంగల్‌కు ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బిజెపి అగ్రనేతలు తెలంగాణ బాట పడుతున్నారు. ఈసారి ఖచ్చితంగా అధికారం చేపట్టాలని పార్టీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నాగర్ కర్నూల్ బహిరంగ సభ నిర్వహించగా తాజాగా ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. జూలై 8న వరంగల్‌లో పర్యటించనున్నారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వేగన్ ఓరలింగ్ సెంటర్‌కు శంకుస్థాపనన చేయనున్నారు.

అనంతరం వరంగల్ మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌కు శంకుస్థాపన చేస్తారు. తరువాత హన్మకొండలోని ఆర్ట్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్ని ప్రసంగిస్తారు. 200 ఎకరాల్లో రూ. 10వేల కోట్లతో టెక్స్‌టైల్స్ పార్కును కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతుంది. ప్రధాని బహిరంగ సభకు రాష్ట్ర బిజెపి నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.దీంతో ప్రధాని తెలంగాణ పర్యటకు ప్రాధ్యాతన సంతరించుకుంది. మరోవైపు 8న హైదరాబాద్ లో జేపీ నడ్డా అధ్యక్షతన జరగాల్సిన 11రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News