Sunday, December 22, 2024

మార్చి 6న బెంగాల్‌లో ప్రధాని మోడీ పర్యటన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారాసత్‌లో మార్చి 6న ఒక మహిళల ర్యాలీనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. అదే రోజున సందేశ్‌ఖలీకి చెందిన బాధిత మహిళలను కూడా ఆయన కలుసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు సుకాంత మజుందార్ గురువారం విలేకరులకు తెలిపారు.

సందేశ్‌ఖలి ద్వీపానికి చెందిన మహిళలతో ప్రధాని మోడీ సమావేశమవుతారా అని విలేకరులు ప్రశ్నిచంగా పందేశ్‌ఖలికి చెందిన సోదరీమణులు, తల్లులు ప్రధాని మోడీని కలవాలని భావిస్తే తామ తప్పకుండా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. కాగా&కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫిబ్రవరి 28న పశ్చిమ బెంగాల్ సందర్శించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News