Saturday, December 21, 2024

మెట్రో రైలులో విద్యార్థులతో మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : శుక్రవారం ఢిల్లీ వర్శిటీకి మెట్రోరైలులో వెళ్లిన ప్రధాని మోడీ కొద్ది మంది విద్యార్థులతో ముచ్చటించారు. ప్రధాని తమతో పలు విషయాలను మాట్లాడినట్లు, ప్రత్యేకించి దేశ నిర్మాణంలో యువత పాత్రను కొనియాడినట్లు 19 ఏండ్ల బికామ్ విద్యార్థి శివమ్ గుప్తా తెలిపారు. దేశ ప్రధానితో కలిసి సాగడం, ముచ్చటించడం తమకు ఓ అత్యద్భుత అనుభవం అయిందన్నారు. స్థానిక లోక్ కళ్యాణ్ మార్గ్ మెట్రోస్టేషన్‌లో రైలు ఎక్కిన మోడీ యెల్లోలైన్‌లోని విశ్వవిద్యాలయ మెట్రోస్టేషన్ వద్ద దిగారు. ప్రధాని మెట్రో ప్రయాణం , విద్యార్థులు కొందరు ఆయన పక్కన కూర్చోవడం, కొందరు చుట్టూ గుమికూడినిలబడటం వంటి ఫోటోలను తరువాత అధికారులు వెలువరించారు.

ప్రధాని ప్రయాణం సమయంలో స్టేషన్లలో, కోచ్‌లలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సరికొత్త భారత్ నిర్మాణానికి యువత పాత్ర కీలకం అని ప్రధాని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్ట పెరగడానికి కారణం యువత ప్రాతినిధ్యం, వారి ప్రతిభనే అని తేల్చిచెప్పారు. బాగా చదువుకోండి అయితే ఇదే దశలో మంచి ఆరోగ్యంతో ఉండండని తెలిపారు. తాను ఇక్కడనే చదువుకుని ఇక్కడనే ఉంటానని, ఉద్యోగాలకు విదేశాలకు వెళ్లే ప్రసక్తే లేదని శివమ్ గుప్తా ప్రధానికి చెప్పారు. ప్రధాని మోడీ వర్శిటీ కార్యక్రమం తరువాత తిరిగి మెట్రోలోనే వెళ్లారని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News