Thursday, January 23, 2025

బర్త్‌డే రోజున ఢిల్లీ మెట్రోరైలులో ప్రధాని..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం దేశ రాజధానిలో మెట్రోరైలు ప్రయాణం చేశారు. స్థానిక విస్తారిత ఢిల్లీ ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ ఆరంభ కార్యక్రమం ముందు ప్రధాని మెట్రో ప్రయాణం సాగింది. ద్వారకా సెక్టార్ 21 నుంచి యశోభూమి ద్వారకా సెక్టార్ 25 స్టేషన్ వరకూ రైలులైన్ విస్తరణ జరిగింది. ప్రధాని మోడీ దౌలా కువాన్ స్టేషనలో రైలులోకి చేరుకుని , మార్గమధ్యంలో పలువురు ప్రయాణికులు ఆయనతో ముచ్చటించారు. ఈ రోజు ప్రధాని పుట్టినరోజు కావడంతో ఆయనకు పలువురు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తన వద్దకు వచ్చిన ఓ బాబుకు ప్రధాని మోడీ ఓ చాక్లెట్ ఇచ్చారు. కొందరు మోడీతో కలిసి సెల్పీలు దిగారు. ఢిల్లీ మెట్రో రైలు లైను విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే రెండు కిలోమీటర్ల మేర ఎయిర్‌పోర్టు లైన్ విస్తరణ ఉంటుంది. ఇంటర్నేషనల్ కన్వెష్షన్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసిసి) తొలి దశను ప్రధాని ఆరంభిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News