Sunday, December 22, 2024

నవరాత్రి శుభ స్వర కానుక..మోడీ రాసిన గర్బా సందడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ గుజరాతీ నృత్యరూపకం గర్బాను రచించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా శనివారం వ్రకటించారు. తాను గత కొద్ది రోజులుగా రాసిన గర్బా ఈ శరన్నవరాత్రుల సందర్భంగా దీనిని విడుదల చేస్తారని తెలిపారు. తాను కొద్ది సంవత్సరాల క్రితం రాసిన గర్బాకు ఇప్పుడు తిరిగి కొత్త మెరుగులు దిద్దినట్లు పేర్కొన్న ప్రధాని ఈ సందర్భంగా బాలీవుడ్ సంగీత దర్శకులు తనిష్క్ బాగ్చీ, గాయని ధ్వని భానుశాలీకి కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాలు ఆదివారం నుంచి అట్టహాసంగా ఆరంభం అవుతాయి. ఈ నేపథ్యంలో ప్రధాని రాసిన గర్బా గురించి ముందస్తు సమాచారాన్ని ఎక్స్ సామాజిక మాధ్యమంలో పెట్టారు.

దీనిపై ప్రధాని స్పందించారు. తన పాటకు సరికొత్తగా శుభకరమైన రూపం తీసుకువచ్చినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్న ప్రధాని ఈ నేపథ్యంలోనే తాను ఇటీవల ఉత్తరాఖండ్‌కు వెళ్లినప్పటి ఫోటోలు పొందుపర్చారు. ఎవరైనా ఉత్తరాఖండ్‌కు వెళ్లాలనుకుంటే అక్కడి పార్వతి కుండ్, జాగేశ్వర్ ఆలయాలను చూడాలని చెపుతానని వెల్లడించారు. కుమాన్ ప్రాంతంలోని ఈ స్థలాలలో సహజసిద్ధమైన ప్రకృతి రమణీయత, అంతకు మించిన ఆధ్యాత్మికత అందరిని కట్టిపడేస్తాయని తెలిపారు. తాను ఇక్కడనే ధ్యానం చేసినట్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News