Monday, December 23, 2024

సోషల్ మీడియా డీపీల్లో జాతీయ జెండా… మోడీ విజ్ఞప్తి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు కేంద్రం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రజలంతా తమ సామాజిక మాధ్యమాల్లో డీపీ (డిస్ప్లే ఫొటో)గా జాతీయ జెండా పెట్టుకోవాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆదివారం ఉదయం తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. దేశం, మన మధ్య బంధాన్ని పెంచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు. 77 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ హర్‌ఘర్ తిరంగా నిర్వహిస్తోంది. పౌరుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News