Wednesday, January 22, 2025

హనుమంతుని విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

hanuman statue
అహ్మదాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హనుమాన్ జయంతి సందర్భంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా గుజరాత్‌లోని మోర్బీలో 108 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ఆవిష్కరించి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ‘నేడు పవిత్ర దినం ఘనమైన విగ్రహాన్ని జాతికి అంకితం చేశాను. ఇది రామభక్తులకు, హనుమంతుడి భక్తులకు ఆనందదాయకమైన విషయం’ అన్నారు. ప్రధాని మోడీ ‘రామచరిత్ మానస్’ను ప్రస్తావిస్తూ ఈశ్వరుడి అనుగ్రహం లేకుండా సాధువుల దర్శన భాగ్యం దుర్లభం అవుతుంది. భక్తి, సేవాభావంతోనే హనుమంతుడు అందరినీ కలుపుతాడు. ఆయన ద్వారా ప్రేరణ కలుగుతుంది. హనుమంతుడు శక్తికి ప్రతీక, వానవాసీలు ఆయనకు గౌరవ,మర్యాదలు ఇప్పించారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News