Monday, December 23, 2024

ఢిల్లీలో 72 అడుగుల దీన్‌దయాళ్ విగ్రహం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జనసంఘ్ సహ వ్యవస్థాపకులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 72 అడుగుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఆవిష్కరించారు. ఇక్కడి బిజెపి ప్రధాన కార్యాలయం ఎదుట పార్కులో ఈ విగ్రహం ఏర్పాటు అయింది. దీన్ దయాళ్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన మహనీయుడని, జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం అని తెలిపారు.

పేదలు అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతికి తపించారని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా తదితరులు పాల్గొన్నారు. ఈ విగ్రహావిష్కరణ సభలో ప్రధాని మోడీ మహిళా బిల్లు, చంద్రయాన్, జి 20 సదస్సు విజయవంతం వంటి విషయాలను ప్రస్తావించారు. మహిళలకు సరైన ప్రాతినిధ్యం లేకుండా సమ్మిశ్రిత సమాజం , సంఘటిత ప్రజాస్వామ్యం పరిపూర్ణం కాదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News