Thursday, January 23, 2025

ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’

- Advertisement -
- Advertisement -

 

Modi3

న్యూఢిల్లీ: పౌష్టికాహార లోపానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజలు కలిసి రావాలని, దానిని నిర్మూలించేందుకు సామాజిక స్పృహను ఉపయోగించుకోవాలని ఆదివారం తన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘అమృత మహోత్సవ్’ అమృతధార ఈ నెలలో దేశం నలుమూలలా ప్రవహిస్తున్నదని మోడీ అన్నారు. “అమృత్ మహోత్సవ్, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, మేము దేశం యొక్క సామూహిక శక్తిని చూశాము”  అన్నారు. వచ్చే నెలలో పౌష్టికాహార లోపానికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొనాలని మోడీ ప్రజలను కోరారు. “పండుగలతో పాటు, సెప్టెంబరు పోషకాహారానికి సంబంధించిన పెద్ద ప్రచారానికి కూడా అంకితం చేయబడింది. మేము సెప్టెంబర్ 1 మరియు 30 మధ్య ‘పోషన్ మాహ్’ లేదా పోషకాహార మాసాన్ని జరుపుకుంటాము,” అని మోడీ తెలిపారు.  పోషకాహార లోపానికి వ్యతిరేకంగా అనేక సృజనాత్మక, విభిన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. “టెక్నాలజీని మెరుగ్గా ఉపయోగించడం, ప్రజల భాగస్వామ్యం కూడా ‘పోషణ్ అభియాన్’లో ముఖ్యమైన భాగంగా మారాయి. భారతదేశాన్ని పోషకాహార లోప రహితంగా మార్చడంలో జల్ జీవన్ మిషన్ పెద్ద ప్రభావాన్ని చూపుతుంది” అని ఆయన అన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News