Monday, December 23, 2024

2024లో మోడీ విజయం తధ్యం : సిఎం షిండే

- Advertisement -
- Advertisement -

నాసిక్ : విపక్షాలు ఇంతవరకు తమ నాయకుడెవరో నిర్ణయించుకోలేక విఫలం చెందుతున్నాయని, ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీ విజయం తథ్యమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే జోస్యం చెప్పారు. శాసన అప్లియదారి ( మీ ముంగిట ప్రభుత్వం ) కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్‌సిపి నేత అజిత్‌పవార్ శివసేనబీజేపీ ప్రభుత్వంలో చేరడంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగవంతంగా కార్యక్రమాలు చేపట్టడానికి వీలవుతోందని , నిర్ణయాలు కూడా వేగంగా తీసుకోగలుగుతున్నామని చెప్పారు. ముంబై లోని మెట్రో ప్రాజెక్టు, ముంబైనాగపూర్ సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే పనులు ఇదివరకు ఆగిపోయాయని, అయితే తమ ప్రభుత్వం ఆ ఆటంకాలను తొలగించిందని ఉదహరించారు. రెడ్ టేపిజంను అంతం చేయడానికి మీ ముంగిట ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టడమైందని,

ఈ కార్యక్రమం తీసుకున్న చొరవ వల్ల ప్రజలు అవసరమైన డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, వివిధ పథకాల ప్రయోజనాలు ఒకే చోట అందగలుగుతారని ముఖ్యమంత్రి షిండే వివరించారు. బీజేపీ నాయకుడు, డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ తనకు చాలా మంచి స్నేహితుడని, ఇదివరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవారని, ఇప్పుడు ఆయన డిప్యూటీ సిఎం అయినా, తాను సిఎం అయినా సరే తామిద్దరం కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు మరో డిప్యూటీ సిఎంగా అజిత్ పవార్‌కు అవకాశం ఇవ్వడానికి అంగీకరించడం ఆయన విశాల భావాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. కొంతమంది ఆయనను ‘కళంకితుడు’ అని ముద్రవేసినా, వాస్తవానికి ఎలాంటి మచ్చలేని నిష్కళంకగా ప్రశంసించారు. శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరే ఇటీవల ఫడ్నవిస్‌ను కళంకితుడుగా నాగపూర్‌లో వ్యాఖ్యానించడం రాజకీయ దుమారం రేపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News