Thursday, January 23, 2025

నేడు మధ్యప్రదేశ్‌కు ప్రధాని

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా అక్కడ ఆయన వందేభారత్ రైళ్లకు ప్రారంభోత్సవం నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు, అక్కడి నుంచి ఐదు వందేభారత్ రైళ్లకు పచ్చ జెండా చూపి ప్రయాణాలను ఆరంభిస్తారు. ప్రధాని మోడీ ప్రారంభించే రైళ్ల వివరాలను అధికారులు తెలిపారు. భోపాల్ (రాణి కమలాపతి ) ఇండోర్‌వందేభారత్ ఎక్స్‌ప్రెస్,

భోపాల్ (రాణి కమలాపతి ) జబల్పూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్, రాంచీ పాట్నా వందేభారత్ ఎక్స్‌ప్రెస్, ధర్వాడ్ బెంగళూరు వందేభారత్, గోవా(మడగాన్ ) ముంబై వందేభారత్ రైళ్లను ఆయన ప్రారంభిస్తారని వెల్లడించారు. పర్యాటక, వాణిజ్య, యాత్రా స్థలాలను , వివిధ రాష్ట్రాల మధ్య మరింతగా రైళ్లద్వారా అనుసంధానాన్ని పెంచేందుకు ఈ వందేభారత్ రైళ్లు దోహదం చేస్తాయని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News