Monday, December 23, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ప్రధాని మోడీకి టిటిడి ఛైర్మన్, ఈవో, ఆలయ అర్చకులు ఆలయ మహాద్వారం వద్ద ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న మోడీకి రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ప్రధానికి శ్రీవారి పట్టువస్త్రాలతో టిటిడి ఛైర్మన్, ఈవో సత్కరించారు. తర్వాత స్వామివారి చిత్రపటాన్ని ప్రధానికి బహూకరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, ప్రధాని హోదాలో నాలుగోసారి మోడీ శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇక, రెండోరోజు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో మహబూబాబాద్ కు చేరుకుని, విజయ సంకల్ప సభలో పాల్గొననున్నారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్‌ విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ నుంచి కాచిగూడ వరకు మోడీ రోడ్‌ షోలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియంలో భక్తి టీవీ కోటిదీపోత్సవంలో పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News