Wednesday, September 18, 2024

సిజెఐ నివాసానికి ప్రధాని వెళ్లడం ప్రొటోకాల్‌కు విరుద్ధం:శివసేన

- Advertisement -
- Advertisement -

గణేశ్ ఉత్సవం సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్ నివాసాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించడం ప్రొటోకాల్ గురించి ప్రశ్నలను లేవనెత్తుతోందని శివసేన (యుబిటి) శుక్రవారం వ్యాఖ్యానించింది. భారత రాజకీయ వ్యవస్థలో చివరి స్తంభాన్ని మోడీ దిగజార్చారని, దేశం ‘హీనస్థితికి’ ఇది దారి తీసిందని ఉద్ధవ్ థాక్కరే సారథ్యంలోని పార్టీ తన పత్రిక ‘సామ్నా’లో ఒక సంపాదకీయంలో ఆరోపించింది. ‘ప్రధాని, సిజెఐ మధ్య వ్యక్తిగత సమావేశం ప్రొటోకాల్ గురించిన ప్రశ్నలను లేవనెత్తింది’ అని సేన (యుబిటి)

బుధవారం చంద్రచూడ్ నివాసానికి మోడీ సందర్శనను ప్రస్తావిస్తూ ఆరోపించింది. మోడీ సందర్శన వివాదానికి దారి తీసిన విషయం విదితమే. రిటైర్‌మెంట్ అనంతరం ప్రయోజనాలు న్యాయవ్యవస్థకు ఆందోళనకరమైనవేనని సంపాదకీయం పేర్కొన్నది. చంద్రచూడ్‌ను సేన (యుబిటి) విమర్శిస్తూ, రిటైర్‌మెంట్ తరువాత ఆయనను ప్రధాని ‘ఎక్కడ నియమిస్తారో’ చూడడం ఆసక్తికరం అని అన్నది. సుప్రీం కోర్టు వెబ్‌సైట్ ప్రకారం, చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News