Sunday, January 19, 2025

ఈనెల 27న హైదరాబాద్ కు ప్రధాని మోడీ రాక

- Advertisement -
- Advertisement -

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈనెల 27న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. హైటెక్ సిటిలోని నోవాటెల్ లో జరగనున్న ప్రొఫెషనల్స్ మీటింగ్ లో ఆయన పాల్గొననున్నారు. ఎడ్యూకేటెడ్ సెక్టార్స్ లో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే ఐటీ రంగ ప్రొఫెషనల్స్ తో పాటు వైద్యులు, న్యాయవాదులకు ఆహ్వానం అందింది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ప్రధాని మోడీ తొలిసారిగా తెలంగాణకు రానున్నారు. ప్రధాని మోడీ పర్యటన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తెలంగాణలో పర్యటిస్తారని బిజెపి వర్గాలు తెలిపాయి. అమిత్ షా రాష్ట్రంలోని బిజెపి కీలక నేతలకు ఎన్నికల వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News