Thursday, January 9, 2025

ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈ నెల 19న హైదరాబాద్‌లో జరగవలసి ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వాయిదా పడింది. ప్రధాని తన పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడంతోపాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయవలసి ఉంది. ప్రధాని హైదరాబాద్ పర్యటన వాయిదా పడినట్లు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డికి బుధవారం సమాచారం అందింది. ప్రధాని మయోడీ తదుపరి పర్యటన వివరాలు త్వరలో ప్రకటిస్తారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News