Sunday, January 19, 2025

తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటన

- Advertisement -
- Advertisement -

చెన్నై : ప్రధాని నరేంద్ర మోడీకి శుక్రవారం ఒక వైపు చెన్నైలో ఘన స్వాగతం లభించగా యువజన కాంగ్రెస్ (వైసి) సభ్యులు ముగ్గురు ఆయన వాహన శ్రేణి వైపు నల్ల బెలూన్లు ప్రదర్శించారు. ఆ సంఘటన దరిమిలా, మౌంట్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. పలువురు కాంగ్రెస్ నేతల నిర్బంధం పట్ల నిరసన సూచకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నల్ల బెలూన్లు ప్రదర్శించారు.

తమిళనాడులోకి ప్రధాని రాక సమయంలో ముందస్తు కస్టడీలోకి ఆ నేతలను తీసుకున్నారు. ‘గో బ్యాక్ మోడీ’ నినాదాలు రాసిన నల్ల బెలూన్లను యువజన కాంగ్రెస్ కార్యకర్తలు రాజా విక్రమన్, మరి ఇద్దరు విడుదల చేశారు. ప్రధాని మోడీ పర్యటన సమయంలో నిరసనను అడ్గుకోవడానికి ఎస్‌సి విభాగం అధ్యక్షుడు ఎంపి రంజన్ కుమార్ సహా పార్టీ నేతలను నిర్బంధంలోకి పోలీసులు తీసుకోవడాన్ని తమిళనాడు కాంగ్రెస్ కమిలీ అధ్యక్షుడు కె ఎస్ అళగిరి ఆక్షేపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News