- Advertisement -
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బిజెపి అగ్ర నాయకులు తెలంగాణ బాట పట్టారు. అందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 7న రాష్ట్రానికి రానున్నారు. ఎల్బీ స్టేడియంలో ఆ పార్టీ నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొననున్నారు. సభలో పాల్గొనేందుకు ప్రధా ని దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5.05 గంటలకు బేగం పేట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియంకు చేరుకుంటారు. 5.30 నుంచి 6.10 గంటల వరకు బీసీ ఆత్మగౌరవ బహిరంగ సభలో పాల్గొని ప్రధాని ప్రసంగిస్తారు. సభ ముగించుకుని సాయంత్రం 6.35 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి తిరిగి ఢిల్లీ పయనం కానున్నారు. అక్కడ నిర్వహించే సభను బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని భారీస్ధాయిలో ఏర్పాట్లు చేస్తుంది.
- Advertisement -