Wednesday, January 22, 2025

అజ్మీర్ దర్గాకు ఛద్దర్ సమర్పించిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ముస్లిం సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాన్ని కలుసుకుని అజ్మీర్ షరీఫ్ దర్గాలో సమర్పించేందుకు ఛద్దర్‌ను బహుకరించారు. ప్రముఖ సూఫీ గురువు మొయినుద్దీన్ ఛిస్తీ వర్ధంతిని పురస్కరించుకుని అజ్మీర్ షరీఫ్ దర్గాలో జరిగే ఉర్సులో ఛద్దర్‌ను సమర్పించవలసిందిగా ప్రధాని మోడీ ముస్లిం సభ్యుల ప్రతినిధి బృందానికి బహుకరించారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ సామాజికమాధ్యమం ఎక్స్ ద్వారా తెలిపారు. ఈ సమావేశంలో మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ, బిజెపి మైనారిటీ మోర్చ అధ్యక్షుడు జమాల్ సిద్దిఖి కూడా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News