Sunday, December 22, 2024

మోడీ, రేవంత్ ట్వీట్ ఫైట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మధ్య మరోసారి ట్విట్ ఫైట్ జరిగిం ది. హర్యానా ఎన్నికల సందర్భంగా గతంలో కూడా ప్ర ధాని మోడీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించిన విష యం తెలిసిందే. తిరిగి అదే తరహా విమర్శలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ఉటంకిస్తూ ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా(ట్విట్టర్) విమర్శలు గుప్పించారు. హర్యానా, కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నికల్లో ఎలాగైనా గెలువడం కోసం ఎడాపెడా హామీలను ఇచ్చి వా టిని నెరవేర్చడం లేదని మోడీ తన ట్విట్‌లో ఆరోపించా రు. వారు ఇచ్చిన హామీలను అమలు చేయలేమని తెలి సే కాంగ్రెస్ ప్రజలకు తప్పుడు వాగ్ధ్దానాలు ఇస్తుందని మోడీ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ, రుణ మాఫీ చేస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చలేదని, వారు ఇచ్చిన హామీ కోసం రైతులు ఇంకా ఎదురుచూస్తున్నారని మోడీ విమర్శించారు.

సీఎం రేవంత్ ఘాటుగా సమాధానం
ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు సిఎం రేవంత్‌రెడ్డి ధీటుగా స్పందిస్తూ, ప్రధానిని ట్యాగ్ చేస్తూ రీట్విట్ చేశారు.‘ ప్రియమైన నరేంద్ర మోడీ జీ, నా రాష్ట్రం, మా ప్రభుత్వం గురించి మీరు చేసిన ప్రకటనలో అనేక అపోహలు, అవాస్తవాలపై స్పష్టత ఇవ్వడానికి సంతోషంగా ఉంది. డిసెంబర్ 7, 2023న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఆనందం, ఆశలు చిగురించాయి. పదేండ్ల బిఆర్‌ఎస్ పాలన తొలిగిపోవడంతో ప్రజల్లో సంతోషం వెల్లివిరిసింది. నేను సిఎంగా బాధ్యతలు స్వీకరించిన 48 గంటలలోనే , తెలంగాణ ప్రభుత్వం మొదటి, రెండవ వాగ్దానాన్ని నెరవేర్చింది. ఆర్‌టిసి బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య్రశ్రీ కింద పది లక్షల రూపాయల ఆరోగ్య బీమా అమలులోకి తీసుకొచ్చాం. గడిచిన 11 నెలలలో తెలంగాణలోని అక్కాచెల్ల్లెండ్రు, అమ్మలు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రయాణించారు. రాష్ట్రవ్యాప్తంగా 101 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసారు. ఏడాది పూర్తి కాకుండానే మహిళల ఉచిత ప్రయాణం కోసం రూ.3,433 కోట్లు ఖర్చు చేశాం.

మేము అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాకుండానే రైతులకు రుణ మాఫీ చేశాం. 22.22 లక్షల మంది రైతులకు ఇప్పుడు ఎలాంటి రుణం లేకుండా రైతు రాజులా జీవిస్తున్నారు. రెండు లక్షల వరకు రైతుల రుణాలను అన్నింటినీ మాఫీ చేశాం. కేవలం 25 రోజులలో రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఇండ్లకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా గృహ విద్యుత్ అందిస్తున్నాం. దీనికి మహిళలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో గ్యాస్ సిలిండర్ ఎక్కడైనా రూ.500 ఇస్తున్నారా?. ఇప్పటి వరకు 1.౩1 కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్లకు రీఫిల్ చేసి ఇచ్చాం. దీని వల్ల 42 లక్షల 90 వేల మంది లబ్ధిపొందడమే కాకుండా ఆనందంగా ఉన్నారు. నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ నియామకాలు చేపట్టాం. మా ప్రభుత్వం విస్తృతంగా నియామకాలను చేపట్టింది. అన్ని స్థాయిల పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. గ్రూప్-1,2,3,4 పరీక్షలను 11 నెలల కంటే తక్కువ సమయంలో నిర్వహించి,

తమ ప్రభుత్వం 50 వేల మంది అర్హులకు ఉద్యోగాలు కల్పించింది. ఇది బిజెపి పాలిత రాష్ట్రాలలో చేయని పని. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యార్థులను పూర్తిగా విస్మరించింది. దశాబ్దం తర్వాత సంక్షేమ వసతి గృహాలలో పేద పిల్లలకు మెస్, కాస్మోటిక్ చార్జీలు 40 శాతానికి పైగా పెంచాం. గతంలో నిర్లక్షానికి గురైన మూసీ నది ప్రక్షాళన చేసి పూర్వ వైభవం తీసుకరావడానికి ప్రయత్నం చేస్తున్నాం. గడిచిన పది ఏండ్లలో ఆక్రమణలకు గురై ధ్వంసమైన చెరువులు, కాలువల వంటి నీటి వనరుల పరిరక్షణపై దృష్టిసారించాం. కాంగ్రెస్ అధికారం చేపట్టాక ఒక్క అంగుళం చెరువు కూడా ఆక్రమణకు గురికాలేదు. మరో విషయం మా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయబోతుంది. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతోంది. గడిచిన 11 నెలల్లో మేము తెలంగాణలో చీకట్లను పారద్రోలి వెలుగులను నింపాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి తన ఎక్స్ ఖాతాలో సుదీర్ఖంగా వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News