Monday, January 20, 2025

సోనియా ఆరోగ్యంపై మోడీ వాకబు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైన రోజే గురువారం ఉభయ సభలు మణిపూర్ అంశంపైనే చర్చించాలని ఉభయ సభల్లోని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో రెండు సభలూ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. అయితే సభ ప్రారంభం అయ్యే ముందు కాంగ్రెస్ నేత సోనియా గాంధీని ప్రధాని మోడీ పలుకరించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అందుకు ఆమె బదులిస్తూ తన ఆరోగ్యం బాగుందని చెప్పారు.

Also Read: ఆ టమాటా రైతు ఇప్పుడు కోటీశ్వరుడు

ఈ సందర్భంగా మణిపూర్ అంశంపై చర్చించాలని మోడీకి సోనియా విజ్ఞప్తి చేసినట్టు లోక్‌సభలో ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌధురి వెల్లడించారు. సమావేశాల తొలిరోజు సభ్యులను ప్రధాని మోడీ కలిసిన సందర్భంగా ఈ సంభాషణ జరిగినట్టు ఆయన చెప్పారు. లోక్‌సభ సమావేశాల తొలిరోజు వివిధ పార్టీల సభ్యులు పలుకరించుకోవడం సంప్రదాయం. ఈ సందర్భంగా సభ ప్రారంభానికి ముందు వివిధ పార్టీల సభ్యులను మోడీ పలుకరించారు. ఇటీవల సోనియా, రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడాన్ని ప్రస్తావించిన మోడీ అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News