Sunday, January 19, 2025

ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు: రాహుల్

- Advertisement -
- Advertisement -

జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో రెండు రాష్ట్రాల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ  భారతదేశంలోని పేదల సొమ్ముతో కోటీశ్వరుల ప్రయోజనాలను పరిరక్షిస్తున్నారని ఆరోపించారు. జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రతిపక్ష కూటమి I.N.D.I.A. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పోరాడుతుంటే బిజెపి దాన్ని చెత్తబుట్టలో వేయాలని చూస్తోందన్నారు.

‘ప్రధాని అంటారు,  రాహుల్ రెడ్ బుక్ ను గాలిలో ఊపుతుంటారని… పుస్తకం రంగు కాదు అందులో ఉన్న విషయం తెలియాలి. మీరు దాన్ని చదివారా? అది చదివి ఉంటే మీరు సమాజాన్ని చీల్చేందుకు ఇంత విద్వేషాన్ని వ్యాపింపజేసి ఉండేవారు కాదు’ అని రాహుల గాంధీ అన్నారు.

ఇదిలావుండగా రక్షణ మంత్రి  రాజ్ నాథ్ సింగ్ కాంగ్రెస్, రాహుల్ గాంధీని విమర్శించారు. ముఖ్యంగా ‘కులగణన నిర్వహిస్తాం’అన్న వాగ్దానంపై రాజకీయ లబ్ధి కోసం ఓటర్లను మభ్యపెట్టేందుకే వారు ఈ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News