Monday, December 23, 2024

ప్రధాని వరంగల్ షెడ్యూల్ ఖరారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వరంగల్ పట్టణంలో చేపట్టే శంకుస్థాపనలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 7:35 నిమిషాలకు ఉత్తరప్రదేశ్ వారణాసి ఏయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి ఉదయం 9:25 నిమిషాలకు హకీంపేట విమానాశ్రయం చేరుకుంటారు. ఉదయం 9:30 హెలిక్యాప్టర్ ద్వారా వరంగల్ కు ప్రయాణం..10:15 మామునూర్ విమానాశ్రయం చేరుకుంటారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గానా ఉదయం 10:30కి భద్రకాళీ దేవాలయానికి వెళ్తారు. 10:45 వరకు అమ్మవారి దర్శనం, పూజలు నిర్వహించి ఉదయం 11:00 శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11:45 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి 12:30 గంటలకు మామునూర్ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్ ద్వారా హకీంపేటకు మధ్యాహ్నం 1:40 గంటలకు చేరుకుంటారు. రాజస్థాన్‌కు ప్రధాని తిరుగు ప్రయాణం కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News