- Advertisement -
ఉగ్రవాదాన్ని తుదముట్టించే సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గురువారం బీహార్ పర్యటనలో ఉన్న ప్రధాని.. పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ఉగ్రదాడిలో అమాయకులు చనిపోయారని.. మృతుల ఆత్మశాంతి కోసం సంతాపం తెలపమన్నారు. ఇది కేవలం పర్యాటకులపై జరిగిన దాడి కాదు. భారత ఆత్మపైనే దాడికి దుస్సాహసం చేశారు. ఉగ్రవాదులను, వారికి సహకరించిన వారిని వదిలిపెట్టబోం. బీహార్ నేలపై నుంచి ప్రపంచమంతటికి చెబుతున్నా.. ఉగ్రదాడికి పాల్పడినవారిని ఎవరిని వదిలిపెట్టం” అని ప్రధాని అన్నారు.
- Advertisement -