ఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసంలో జరిగిన వినాయక పూజలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. సిజెఐ ఇంటికి వెళ్లిన ప్రధాని మోడీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయమూర్తులు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టేనని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు. ప్రశాంత్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ప్రైవేట్ మీట్ కోసం సిజెఐ చంద్రచూడ్ తన నివాసానికి మోడీని అనుమతించడం మంచిది కాదు అని, ఇలాంటి సమయంలో న్యాయవ్యవస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని భూషణ్ పేర్కొన్నారు. సిజెఐ ఇంట్లో జరిగిన గణపతి పూజలో ప్రధాని మోడీ పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిజెఐ ఇంటికి ప్రధాని వెళ్లడం ఎంత వరకు సరైందని నెటిజన్లు నిలదీస్తుండగా మరికొందరు సమర్థిస్తున్నారు. సిజెఐ ఇంట్లో ప్రధాని పూజలో పాల్గొనడం తప్పుడు సంకేతాలు ఎలా అవుతాయని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
సిజెఐ ఇంటికి వెళ్లిన మోడీ… సోషల్ మీడియాలో విమర్శలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -