Sunday, January 19, 2025

నేడు వారణాసిలో నామినేషన్ వేయనున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. యూపీలోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు వారణాసిలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి మోడీ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత, మిత్రపక్షాల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్‌ నాయకులు భారీగా హాజరు కానున్నారు. పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఈ కార్యక్రమం జరగనుంది. మోడీ నామినేషన్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News