Saturday, January 11, 2025

కేరళలో మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోడీ!

- Advertisement -
- Advertisement -

కొచ్చి(కేరళ): కొచ్చి దీవులను ప్రధాన భూభాగానికి కలుపుతూ దేశంలోని మొట్టమొదటి వాటర్ మెట్రో సర్వీసును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. సోమవారం నుంచి రెండు రోజులపాటు కేరళలో పర్యటించనున్న మోడీ అనేక ఇతర కార్యక్రమాలలో కూడా హాజరు కానున్నారు. అంతేకాక సీనియర నాయకులతో సమావేశం కానున్నారు.

వాటర్ మెట్రో ప్రాజెక్ట్ కొచ్చి, దాని చుట్టుపక్కల ప్రజలకు సురక్షితమైన, సరసమైన, పాకెట్‌ఫ్రెండ్లీ ప్రయాణాన్ని అందించనున్నది. మొదటి దశలో వాటర్ మెట్రో ఎనిమిది ఎలక్ట్రిక్‌హైబ్రిడ్ బోట్లతో రెండు మార్గాల్లో, హైకోర్టు నుంచి వైపిన్, వైట్టిల నుంచి కక్కనాడ్ వరకు పడవ ప్రయాణ సౌకర్యం కల్పించనున్నది. హైకోర్టు నుంచి వైపిన్ మార్గంలో సింగిల్ జర్నీ టికెట్ ధర రూ. 20గా నిర్ణయించారు. వైట్టిల నుంచి కాక్కనాడ్ రూట్‌కు రూ. 30గా నిర్ణయించారు. కొచ్చి వాటర్ మెట్రో వీక్లి, మంత్లీ, క్వార్టర్లీ పాసులను కూడా అందించనున్నది. ప్రారంభ ఆఫర్‌లో ప్రయాణికులకు డిస్కౌంట్ కూడా ఇవ్వనున్నారు.
కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్, కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ లోక్‌నాథ్ బెహరా ప్రకారం హైకోర్టు నుంచి వైపిన్ వరకు ఏప్రిల్ 26 నుంచి ఉదయం 7.00 గంటలకు, వైట్టిల నుండి కాక్కనాడ్‌కు వరకు ఏప్రిల్ 27 నుంచి ఉదయం 7.00 గంటలకు ఈ వాటర్ మెట్రోలు పనిచేయనున్నాయి. వాటర్ మెట్రో సర్వీసుతో ప్రజలు హైకోర్టు వాటర్ మెట్రో టర్మినల్ నుంచి వైపిన్‌కు 20 నిమిషాల కన్నా తక్కువ సమయంలో చేరుకోవచ్చునని ఆయన తెలిపారు. అలాగే వైట్టిల వాటర్ మెట్రో టర్మినల్ నుంచి కక్కనాద్ టర్మినల్‌కు 25 నిమిషాల కన్నా తక్కువ సమయంలో చేరుకోవచ్చునన్నారు.

ప్రయాణికులు ‘కొచ్చి 1’ కార్డును ఉపయోగించి కొచ్చి మెట్రోలోనూ, వాటర్ మెట్రోలోనూ ప్రయాణించవచ్చునని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. ప్రయాణికులు టిక్కెట్లను డిజిటల్‌గా కూడా బుక్‌చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోడీ కేరళలో సాక్రడ్ హార్ట్ కాలేజ్ గ్రౌండ్స్ వరకు రోడ్ షో నిర్వహించడమే కాకుండా, యువకులకు సంబంధించిన ‘యువమ్ 2023’ కార్యక్రమంలో కూడా పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News