Wednesday, January 22, 2025

మెగా బ్రదర్స్ తో కలిసి ప్రజలకు మోడీ అభివాదం..(వీడియో)

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు టిడిపి, జనసేన కార్యకర్తల, జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరందరి సమక్షంలో ఎపి సిఎంగా చంద్రబాబు ప్రమాణం చేశారు.

PM Modi with Chiranjeevi and Pawan Kalyan

ఆ తర్వాత రాష్ట్ర మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. వీరితోపాటు కేబినెట్ మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా చిరంజీవి, పవన్‌ చేతులు పట్టుకొని పైకెత్తిన మోడీ ప్రజలకు అభివాదం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన వేడుకకు హైలెట్ గా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News