Thursday, September 19, 2024

యోయో టెస్టు మీకు కూడా తప్పదా?: కోహ్లీకి మోడీ ఆసక్తికర ప్రశ్న..

- Advertisement -
- Advertisement -

యోయో టెస్టు మీకు కూడా తప్పదా?
విరాట్ కోహ్లీకి ప్రధాని మోడీ ఆసక్తికర ప్రశ్న
ఫిట్‌నెస్ ఆటగాడికి అత్యావశ్యకమని కోహ్లీ సమాధానం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ‘ఫిట్‌నెస్’కు ఐకాన్స్‌గా భావించే కొందరు ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ఫిట్‌నెస్ ఙండియా మూవ్‌మెంట్’ తొలి వార్షికోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తదితరులతో ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘ఆరోగ్యకరమైన ఆహారం మన జీవన విధానంలో భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాను. ఫిట్‌గా మారడం కష్టమని చాలా మంది అనుకొంటుంటారు. కొద్దిగా క్రమశిక్షణతో సాధన చేస్తే తేలికే. ఫిట్‌గా ఉంటూ ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలి. ఫిట్‌నెస్ కా డోస్ ..ఆధా ఘంటా రోజ్’ అని అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. ‘ కెప్టెన్‌గా ఉన్న మీకు కూడా యోయో టెసు ్ట(ఆటగాళ్ల ఓర్పు సామర్థాన్ని కొలిచే పరీక్ష) నిర్వహిస్తారా?’ అని ప్రశ్నించారు. దీనికి కోహ్లీ సమాధానమిస్తూ ‘ సర్.. యోయో పరీక్ష చాలా ముఖ్యమైంది. ప్రపంచ స్థాయిపరంగా చూస్తే ఇప్పటికీ మా జట్టు స్థాయి కొంచెం తక్కువే. దాన్ని అన్ని విధాలా మెరుగుపర్చుకోవడానికి కృషి చేస్తున్నాం. ఇది ప్రాథమిక అవసరం. టి20, టెస్టులు ఆడాల్సి ఉంటుంది. టెస్టు మ్యాచ్‌లో ఆడితే రోజు మొత్తం ఆడాలి. మళ్లీ మరుసటి రోజుకు సిద్ధం కావాలి. అలాంటి సమయాల్లో ఫిట్‌నెస్ ఓ బెంచ్‌మార్క్. నేనుచొరవ తీసుకొని యోయో టెస్టుకు హాజరవుతా. ఈ పరీక్షలో విఫలమయితే.. నేను కూడా ఆటలో ఉండను. ఈ వ్యవస్థను అలా కొసాగించాల్సిందే’ అని సమాధానమిచ్చారు.

ఫిట్‌నెస్ కోసం మీరు చోలె బటూరెను మిస్సవుతున్నారని మోడీ చమత్కరించగా, ఫిట్‌గా ఉండేందుకు మంచి ఆహార అలవాట్లు తప్పవని కోహ్లీ అంగీకరించారు. ఈ సందర్భంగా నటుడు, మోదల్ మిలింద్ సోమన్, ప్రధాని మధ్య ఆసక్తికరమైన సంభాషణ సాగింది. ‘ మీ వయసు గురించి చెప్పారు కదా.. అది నిజమేనా.. లేక ఇంకేమైనా ఉందా’ అని ప్రధాని ఆసక్తిగా ప్రశ్నించారు. దీనికి మిలింద్ సోమన్ సమాధానమిస్తూ ‘ఇదే విషయం చాలా మంది నన్ను అడుగుతుంటారు. మీ వయసు నిజంగా 55 ఏళ్లా? ఈ వయసులో కూడా 500 కిలోమీటర్లు ఎలా పరుగెత్తగలరు? అని అడుగుతుంటారు. అప్పుడు నేను .. మా అమ్మ వయసు 81 ఏళ్లు. ఇప్పటికీ మా అమ్మ పుషప్స్ చేస్తుంది. మా అమ్మే నాకు స్ఫూర్తి. చాలా మందికి కూడా ఆమె స్ఫూర్తి. మా అమ్మలాగా నా జీవితం ఉండాలని కోరుకుంటా’ అని అన్నారు. మన పూర్వీకులు రోజూ 50 మైళ్లు నడిచే వారని, పల్లెల్లో మహిళలు కూడా నీళ్లు తీసుకు రావడానికి , పనుల కోసం ఇప్పటికీ చాలా కష్టపడుతుంటారని పేర్కొన్నారు. అయితే నగరాల్లో మాత్రం జీవన శైలి భిన్నంగా ఉంటుందని, ఎక్కువగా కూర్చుని ఉంటే మన శక్తి, ఫిట్‌నెస్ తగ్గుతుందని మిలింద్ సోమన్ పేర్కొన్నారు. ఫిట్‌నెస్‌గా ఉండాలంటే ‘ మానసిక బలం ఒక్కటే సరిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో పారాలింపిక్స్ జావలిన్‌త్రో స్వర్ణపతక విజేత దేవేంద్ర, జమ్మూ, కశ్మీర్ మహిళా ఫుట్‌బాలర్ అఫ్షన్ ఆషిక్, న్యూట్రీషినిస్ట్ రుజుతా దివాకర్ తదితరులు కూడా పాల్గొన్నారు. సంక్లిష్ట సమయంలో చేతులెత్తేయకుండా పోరాడాలని జజారియా పిలుపునివ్వగా, ఉదయాన్నే నిద్రలేచి వర్కవుట్లు చేయడం ద్వారా దేశ మహిళలందరినీ ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తానని ఆషిక్ పేర్కొన్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహింద్ర సింగ్ ధోనీ తనకు స్ఫూర్తి అని కూడా ఆమె చెప్పారు.

PM Modi Witty question to Virat Kohli on Yo-Yo Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News