Thursday, January 23, 2025

బాలికకు ప్రధాని మోడీ లేఖ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్ లోని కాంకర్‌లో ర్యాలీ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీకి ఓ బాలిక తాను లిఖించిన మోడీ చిత్రాన్ని బహూకరించారు. ఆ సభలో ఆకాంక్ష ఠాకూర్ అనే బాలిక తాను గీసిన మోడీ చిత్రాన్ని పట్టుకుని నిలబడి ఉండగా, మోడీ గమనించి ఆ బాలికను వేదిక పైకి తీసుకురావాలని అక్కడున్న అధికారులకు సూచించారు. చిత్రాన్ని చూసి మురిసిపోయారు. ఆ సమయంలో చిన్నారికి ప్రత్యేకించి లేఖ రాస్తానని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం , బాలికకు ప్రధాని లేఖ రాశారు. భవిష్యత్తులో ఎన్నో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్టు ఆ బాలికను ఉద్దేశించి లేఖ ద్వారా రాబోయే 25 ఏళ్లు మీలాంటి చిన్నారులకు ముఖ్యమైన రోజులు రానున్నాయని అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News