Monday, December 23, 2024

ప్రధాని యూట్యూబ్ చానల్‌కు 2 కోట్ల సబ్‌స్ర్కైబర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత యూ ట్యూబ్ చానల్‌లో సబ్‌స్ర్కైబర్ల సంఖ్య రెండు కోట్లను దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాధినేతల్లో అత్యధికులు మోడీకి యూ ట్యూబ్ ఖాతాదారులుగా ఉన్నారు.ప్రభుత్వ యూట్యూబ్ చానల్‌లో ప్రధాని తన వీడియోలను పోస్టు చేస్తూ ఉంటారు. ఆ వీడియోలను సుమారు 450 కోట్ల మంది ఇప్పటికే వీక్షించారు.ప్రపంచ నేతల్లో ఎవరు కూడా ఆయన దరిదాపుల్లో లేరు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో సబ్‌స్ర్కైబర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు 64 లక్షల మంది సబ్‌స్ర్కైబర్ల్లున్నారు. ఇక వ్యూస్ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రెండో స్థానంలో ఉన్నారు.

ఆయన వీడియోలకు 22.4 కోట్ల వ్యూస్ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 7.89 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లుండగా, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయిప్ ఎర్డగోన్‌కు 3.16 లక్షల మంది ఉన్నారు. ‘ యోగా విత్ మోడీ’ అన్న యూ ట్యూబ్ చానల్‌లో కూడా మోడీకి ఎక్కడ లేని క్రేజ్ ఉంది.ఆ చానల్‌లో ఆయనకు 73 వేల మంది సబ్‌స్ర్కైబర్లున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చానల్‌కు 35లక్షల మంది సబ్‌స్ర్కైబర్లున్నారు. ప్రధాని మోడీ తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో ఏర్పాటు చేశారు. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఆయన పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News